అఫ్పూ(నయూం)ను సన్మానించిన నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా నియామకమైన అఫ్పూ(నయూం)ను ఆ పార్టీ సీనీయర్ నాయకులు రాజుగౌడ్ సన్మానించారు. బుధవారం అఫ్పూ(నయూం)కు పట్టణ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, మాజీ కౌన్సిలర్ సుమిత్ గౌడ్, నాయకులు బీదర్ రాజశేఖర్, ధర్మిది నాగేష్, ఎర్రం.శ్రీధర్, శివానంద్ తదితరులు పాల్గొన్నారు.


