పట్టణ ప్రగతితో అగ్రపథం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పట్టణ ప్రగతితో అగ్రపథం..!
– కేసీఆర్ చొరవతోనే సమూల మార్పులు
– తాండూరు సమగ్రాభివృద్ధికి కృషి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– అట్టహాసంగా పట్టణ ప్రగతి సంబరాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పట్టణ ప్రగతి వల్లే పట్టణాలు అగ్రపథాన నిలుస్తున్నాయని, సీఎం కేసీఆర్ చొరవతో సమూల మార్పులు జరుగుతున్నాయని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం కాండూరు పట్టణంలో పట్టణ ప్రగతి సంబరాలను అట్టహాసంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి మున్సిపల్లో రంగవళ్లులు, ర్యాలీలు, మానవహారం కార్యక్రమాలను నిర్వహించారు. కొత్త మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కౌన్సిలర్లు, అధికారులతో, నేతలతో కలిసి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు.

అనంతరం సమావేశంలో ప్రసంగిస్తూ తెలంగాణ ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చాన్నారని అన్నారు. కొత్త మున్సిపల్ చట్టంతో టీఎస్ బీపాస్ వ్యవస్థ పట్టణాభివృద్ధికి పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. పట్టణ ప్రగతిలో అన్ని వార్డులకు మౌళిక సదుపాయాలు, ఓపెన్ జిమ్ లు, ప్రకృతి వనాలు, వైకుంఠదామాలు, క్రీడా ప్రాంగణాలు మంజూరు చేశారని తెలిపారు. మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు, బస్తీ దవాఖానలు, రహదారులపై ఎల్‌ఈడీ లైట్లు మంజూరు చేశారని అన్నారు. ఇవేకాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముభారక్, ఆసరా, కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, దళిత బందు, రైతు ఇందు తదితర పథకాలతో పట్టణాలు అభివృద్ధిలో అగ్రపథాన నడుస్తున్నాయన్నారు. దీంతో పాటు మహిళ సంఘాలకు రుణాలు దాదాపు రూ. 84 కోట్ల రుణాలను మంజూరు చేసిందన్నారు. మరోవైపు తాండూరులో 40 ఏండ్లుగా చేయని అభివృద్ధిని నాలుగేళ్లలో చేపట్టడం జరిగిందన్నారు.

పట్టణంలో రోడ్ల విస్తరణ, ఐటీఐ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, దళిత బంధు, బంజార భవన్, అంబేద్కర్ బవన్‌ నిర్మించడం జరుగుతోందన్నారు. అదేవిధంగా కాగ్నానదిపై వంతెనలు, తాండూరుకు బైపాస్ రోడ్డు వంటి పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ పనులను పూర్తి చేసి తాండూరుకు సమూల రూపురేఖలు మార్చేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే రోహిర్ రెడ్డి చేతులు మీదుగా ఉత్తమ అధికారులు, సిబ్బంది, ఆర్పీలు, మహిళ సంఘాలు, తెలంగాణ ఉద్యమ కారులు, స్వచ్ఛంద సంఘాలకు ఉత్తమ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూమ్), మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, ఫ్లోర్ లీడర్లు శోభారాణి, మధుబాల, కౌన్సిలర్లు పల్లెళ్ల నీరజాబాల్ రెడ్డి, విజయదేవి, మంకాల రాఘవేందర్, ప్రభాకర్ గౌడ్, వరాల శ్రీనివాస్ రెడ్డి, బోయరవి, ప్రవీణ్ గౌడ్ సంగీత ఠాకూర్, ఎర్రం వసంత, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్ యువనాయకులు వంటి యాదవ్, ఎర్రం శ్రీధర్, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ ఖాజా, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పైలెట్ బర్త్ డే అదుర్స్‌..!

chaithany collage