సర్కారు రైస్ మిల్లులు..!

జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

సర్కారు రైస్ మిల్లులు..!
– పౌరసరఫరాల సంస్థ ద్వారా ఏర్పాటు, నిర్వహణ
– త్వరలో రూ.2 వేల కోట్ల ఖర్చుతో ఏర్పాటు
– ఆదేశించిన తెలంగాణ సీఎం కేసీఆర్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో సర్కారు ఆధ్వర్యంలో రైస్‌ మిల్లులను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రూ. 2 కోట్లతో ఖర్చుతో ఏర్పాటు చేసి.. ప్రభుత్వమే నిర్వహణ చేసేలా ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు. సచివాలయంలో వరిధాన్యాన్ని ప్రాసెసింగ్‌ చేసే ప్రపంచ ప్రఖ్యాత జపాన్‌కు చెందిన రైస్‌మిల్‌ కంపెనీ సటేక్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులతో చర్చలు నిర్వహించారు. అనంతరం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఛైర్మన్‌ రవీందర్‌ సింగ్‌, కమిషనర్‌ అనిల్‌కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. రైతులకు మేలు జరిగేలా మరిన్ని ప్రణాళికలను పౌరసరఫరాలశాఖ సిద్ధం చేయాలని, రైస్‌మిల్లుల స్థాపన నేపథ్యంలో మరిన్ని బాధ్యతలు చేపట్టేలా అధికారులు, సిబ్బందిని పెంచుకోవాలని మంత్రి గంగుల కమలాకర్‌ను ఆదేశించారు.

ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే మొదటిస్థానానికి చేరుకున్న తెలంగాణ రైతులు తమ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌లో విక్రయించి లాభాలు ఆర్జించే స్థాయికి తీసుకెళ్తామని తెలిపారు. భవిష్యత్తులో వరిధాన్యం నుంచి తయారు చేసే పలురకాల ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ మేరకు మార్కెట్‌ విస్తరించే బాధ్యతను కార్పొరేషన్‌ నిర్వహిస్తుందన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల కానుకగా రైతుల చెంతకే రైస్‌ మిల్లులు చేరి, పంటకు మరింత గిరాకీ పెంచేలా పలు నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు రూ.2 వేల కోట్లకు పైగా ఖర్చుతో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి త్వరలో సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టనున్నారు. ప్రతి జిల్లాలో గంటకు 120 టన్నుల బియ్యాన్ని ఆడించే అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన రైస్‌మిల్లులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న రైస్‌ మిల్లులకు అనుసంధానంగా రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ ఉత్పత్తి చేసే మిల్లులు ఏర్పాటు చేసేందుకు దృష్టిసారిస్తున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు రైతుల పంటకు బహిరంగ మార్కెట్‌ ధర లభించేలా చేయడానికి ధాన్యాన్ని పలురకాల ఉత్పత్తులుగా మార్చే దిశగా జిల్లాల వారీగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం.

ఇది కూడా చదవండి….

తాత తడబడలేదు..!

chaithany collage