విఠల్ నాయక్ నివాసంలో రక్షా బంధన్
– సంతోషంగా పండగ జరుపుకున్న కుటుంబ సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్, వినాయక గ్రూప్స్ అధినేత వర్త్యా విఠల్ నాయక్ నివాసంలో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

శుక్రవారం పండగ సందర్భంగా విఠల్ నాయక్‌కు సోదరిమణులు రాఖీలు కట్టి.. శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వినాయక ఆసుపత్రి సీఈఓ ప్రశాంతి, కోకట్ పాఠశాల హెచ్ఎం కిష్టమ్మలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్, సీఈఓ ప్రశాంతిలు మాట్లాడుతూ అన్నాచెల్లెళ్ల ప్రేమ, ఆప్యా యత, అనుబంధానికి గుర్తుగా రక్షాబంధన్ పండగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.

భారతదేశంలో ప్రాచీన కాలం నుంచే రక్షణ కోసం దారం లేదా రక్షాసూత్రం కట్టే ఆచారాలు ఉన్నాయని గుర్తు చేశారు. కృష్ణుడు ద్రౌపది, కర్ణావతిహుమాయూన్ వంటి రక్షాబంధన్ విశిష్టతను చాటుతున్నాయని అన్నారు. పండగ జరుపుకుంటున్న అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు వర్త్య రవినాయక్, గౌరీ బాయ్ తదితరులు పాల్గొన్నారు.


