తోకముడిచి సమ్మె విరమణ
– వైస్ చైర్ పర్సన్ అండ్ గ్రూఫ్‌ది హైడ్రామా
– స్వార్థం కోసమే కార్మికులతో రాజకీయాలు
– ఆమె చైర్ పర్సన్ అవుతుందో చూస్తా
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: స్వార్థ రాజకీయాల కోసం కార్మికులతో సమ్మె చేయించిన నేతలు రాబోయే పరిమాణాలకు తోకముడిచి సమ్మెను విరమింపజేశారని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. పీఆర్సీ అమలు కోసం కార్మికులు చేపట్టిన సమ్మె విమరణపై స్పందిస్తూ మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మీడియాతో మాట్లాడారు. గత 15 రోజులుగా మున్సిపల్ కార్మికులు పీఆర్సీ అమలు కోసం సమ్మె చేపట్టారని గుర్తుచేశారు. కొందరు నేతలు స్వార్థ రాజకీయాల కోసం కార్మికులను వాడుకుని సమ్మె చేయించారని అన్నారు. సమ్మెను అడ్డుపెట్టుకుని తనపై లేనిపోని ఆరోపణలతో రాద్దాంతాలు చేశారని మండిపడ్డారు. చైర్ పర్సన్ ఎజెండాపై కోర్టుకు వెళ్లడంతో పీఆర్సీ అమలు కాలేదని దుమ్మెత్తి పోసి కార్మికులను తప్పుదోవ పట్టించారని అన్నారు. వైస్ చైర్ పర్సన్ అండ్ గ్రూపు హైడ్రామా చేశారని విమర్శించారు. లేనిపోని రాద్దాంతాలతో తాండూరును భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. తాజాగా అనూహ్య రీతిలో కార్మికులతో సమ్మెను విరమింపజేసి కొత్త డ్రామాకు తెరలేపారని అన్నారు. ఇందంతా ఎందుకు చేశారంటే.. మూడు రోజుల క్రితం కార్మికుల అంశంపై మళ్లీ కోర్టుకు మేము కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. దీనిపై కోర్టు ప్రిన్సిపల్ సెక్రటరికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఈనెల నవంబర్ 29వ తేదిలోపు ఈ అంశంపై మున్సిపల్ కమీషనర్, చైర్ పర్సన్‌లు కోర్టుకు హాజరు కావాలని కఛ్చితమైన ఆదేశాలు జారి చేసిందని, లేదంటే అధికారులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో కార్మికుల చేత సమ్మెను విరమింప చేశారని అన్నారు. వైస్ చైర్ పర్సన్, గ్రంథాలయ చైర్మన్లకు ఏం అధికారం ఉందని హామి ఇస్తారని ప్రశ్నించారు. ఇదంతా ప్రజలు తెలుసుకోవాలని అన్నారు.
చైర్ పర్సన్ ఎలా అవుతావో చూస్తా
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ చైర్ పర్సన్ పీఠంపై కూర్చునేందుకే కుట్రలు చేస్తున్నారని అన్నారు. గత రెండున్నరేళ్లుగా చైర్ పర్సన్‌కు ఎలాంటి సహాకారం అందించకుండా బురదజల్లే రాజకీయాలు చేస్తున్నాని మండిపడ్డారు. మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్, అధికారులు, కొందరు రాజకీయ నాయకులతోకలిసి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. చైర్ పర్సన్ అయ్యేందుకు హైడ్రామాలు చేస్తున్న ఆమె ఎలా చైర్ పర్సన్ అవుతుందో చూస్తామన్నారు. వర్గపోరుతో అభివృద్ధిని అడ్డుకుంటున్నాని.. ఇదేనా రాజకీయాలు చేయడం అని ప్రశ్నించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ సైతం వైస్ చైర్మన్‌కు వత్తాసు పలుకుతూ మున్సిపల్ అంశాలలో జోక్యం చేసుకోవడం తగదన్నారు. ఇప్పటికైనా స్వార్థ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. త్వరలోనే కార్మికుల సమస్యను కూడ పరిష్కరిస్తామని అన్నారు.

