మువ్వ‌న్నెల రెప‌రెప‌లు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మువ్వ‌న్నెల రెప‌రెప‌లు..!
– వాడ వాడ‌ల ఎగిరిన జాతీయ జెండా
– త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగురవేసిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– జాతీయ జెండాను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఆజాదీకా అమృతోత్స‌వ్‌లో భాగంగా వ‌జ్రోత్స‌వాల సంద‌ర్భంగా తాండూరులో మువ్వన్నెల జెండా రెప‌రెప‌లాడింది. సోమ‌వారం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వాడ వాడలా జాతీయ‌ జెండాలను ఎగురవేశారు. దీంతో ఆకాశం త్రివర్ణ శోభితంగా మారింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పట్టణ వాసులంతా ఉత్సహంగా పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పలు పార్టీలు, సంఘాల కార్యాలయాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సంబరంగా జరుపుకున్నారు. తాండూరు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అఫ్పూ(న‌యూం), నేతలతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. తాండూరు మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీచౌక్, పాత తాండూరులోని అంబేద్కర్ పార్కు, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తాండూరు న్యాయస్థానం, జిల్లా ఆస్పత్రి, మాతా శిశు ఆసుపత్రి, డీఎస్పీ కార్యాలయం, పోలీస్టేషన్, తాండూరు మార్కెట్ కమిటి కార్యాలయాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సంబరంగా జరుపుకున్నారు. ఈ వేడుకలలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రముఖులు, పలు పార్టీల నేతలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఎమ్మెల్సీ నివాసం వద్ద సంబరాలు
————————————–

తాండూరు పట్టణంలోని పలు రాజకీయ పార్టీల కార్యాలయంలో ఆదివారం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడులకను ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ, రాష్ట్ర రవాణాశాఖ మాజీ మంత్రి నివాసం ముందు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ వేడుకలలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, టీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల, కౌన్సిలర్ నీరజాబాల్ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, నాయకులు మసూద్, బిర్కడ్ రఘు, సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు.

బీజేపీ ఆధ్వర్యంలో
———————

తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని బీజేపీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. నేతలు జాతీయ గీతం ఆలాపించి జెండాకు వందనం సమర్పించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, కౌన్సిలర్లు సాహు శ్రీలత, బంటారం లావణ్య, పూజ రజనీకాంత్, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, నాయకులు పూజారి పాండు, మల్లేశ్ యాదవ్, మిట్టు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు దోమ కృష్ణ, బొప్పి శ్రీహరి, చిద్రి ప్రకాష్, ఉపాధ్యక్షులు రాజుముదిరాజ్, చంద్రశేఖర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
————————-

పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగ జరుపుకున్నారు. పట్టణ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు హేమంత్ కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు కావలి సంతోష్, సీనియర్ నాయకులు, మైనార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సర్దార్ పటేల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
————————————————–

తాండూరు పట్టణం మలప్ప మడిగ సమీపంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రియల్ ఏ స్టేట్ వ్యాపారి భావనోళ్ల శంకర్ యాదవ్ హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి బీసీ సంఘం కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, అసోసియేషన్ ప్రతినిధులు ప్రేమ్ కుమార్, గడ్డం వెంకటేష్, హరి చల్లా, జోసఫ్, రాయల్ రాజ్ కుమార్, కోటం సిద్ధలింగం, రమేష్ జాదవ్, అశోక్ మాస్టర్, నాయకులు బంటు క మల్లప్ప, రాము ముదిరాజ్, లక్ష్మణ్ చారి, బోయ రాధాకృష్ణ, వాల్మీకి నరేష్, మంతన్ గౌడ్ అశోక్, బస్వరాజ్, వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్. వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.