సర్కారుకు నిరుద్యోగుల గుణపాఠం తప్పదు

తాండూరు రాజకీయం వికారాబాద్

సర్కారుకు నిరుద్యోగుల గుణపాఠం తప్పదు
– అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం
– యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ సర్కారుకు నిరుద్యోగుల చేతిలో గుణపాఠం తప్పదని యూత్ కాంగ్రెస్ తాండూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల మెనిఫెస్టోలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేయడం పట్ల యూత్‌ కాంగ్రెస్ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా శనివారం తాండూరు పట్టణ పోలీసులు యూత్‌ కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగులను మోసం చేస్తుందన్నారు. ఎన్నికల మెనిఫెస్టోలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మాటతప్పిందన్నారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని యూత్‌ కాంగ్రెస్ చేస్తున్న పోరాటాన్ని అడ్డుకోవడంలో భాగంగా నేతలను ముందస్తు అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. రానున్న ఎన్నికల్లో నిరుద్యోగులు సర్కారుకు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు రాజు గౌడ్, అంతరం శ్రీనివాస్, జగదీష్ గౌడ్ లు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!