రెచ్చిపోయిన దొంగలు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

రెచ్చిపోయిన దొంగలు..!
– తాళం వేసిన ఇండ్లలో చోరీలు
– మరో ఇంట్లో వస్తువుల చిందర
– పాస్టర్ ఇంట్లో బంగారం, నగదు అపహరణ
– తాండూరులో కలకలం రేపిన ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధిలో గుర్తుతెలియని దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇండ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఓ ఇంట్లో బంగారం, నగదు ఆపహరించుకుపోగా, మరో ఇంట్లో ఏమి దొరకక పోవడంతో వస్తువులను చిందర వందరగా పడేశారు. ఈ సంఘటన పట్టణంలోని అయ్యప్ప నగర్, గ్రీస్ సిటీ కాలనీలలో కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు అయ్యప్ప నగర్ కు చెందిన లక్ష్మణ్ పాల్ గ్రీన్ సిటీలోని చెర్చ్ లో పాస్టర్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య అనారోగ్యానికి గురికావడంతో వైద్యం కోసం ఇంటికి తాళం హైదరాబాద్ వెళ్లారు. గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం విరగొట్టి లోపలికి చొరబడ్డారు.

బీరువా తాళం ధ్వంసం చేసి లోపల ఉన్న సుమారు 3 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. దీంతో పాటు బెడ్ రూంలో ఉన్న చెర్చ్ కు సంబంధించిన దాదాపు రూ. 15 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు బాధిత పాస్టర్ లక్ష్మణ్ పాల్ తెలిపారు. మరోవైపు గ్రీన్ సిటీ కాలనీలో విఠల్ అనే వ్యక్తికి చెందిన ఇంట్లో చోరికి పాల్పడ్డారు. అక్కడ దొంగలకు ఎలాంటి. డబ్బులు, బంగారం దొరకపోవడంతో ఇంట్లో వస్తువులను చిందర వందర చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. మరొ వైపు విఠల్ అనే వ్యక్తి అందుబాటులో లేకపోవడంతో ఆయన వివరాలు తెలియరాలేదు. మరో బాధితుడు పాస్టర్ లక్ష్మణ్ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు. వినాయక నిమజ్జనం పండగ ముందురోజు ఈ సంఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

ఇదికూడా చదవండి…

14 మంది మట్కారాయూళ్లపై కేసు