మరో రూ.3 లక్షలు దొరికాయి..!
– తరలిస్తున్న వ్యక్తి నుంచి సీజ్
– వివరాలు వెల్లడించిన సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా పోలీసులు నగదును సీజ్ చేస్తున్నారు. తాజాగా ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును పట్టుకున్నట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా పట్టణంలోని వినాయక చౌరస్తా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఓ వ్యక్తి వద్ద నుంచి ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.3 లక్షలను గుర్తించారు. ఈ మేరకు నగదును స్వాదీనం చేసుకుని స్క్రీనింగ్ కమిటికి అందజేయడం జరుగుతుందని సీఐ రాజేందర్ రెడ్డి వెల్లడించారు.
ఇది కూడా చదవండి…

