గౌడ ఆత్మీయ సమ్మేళనం వాయిదా
– సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు బ్రేక్
– త్వరలో తేదిని ప్రకటిస్తాం: గౌడ సంఘం నాయకులు హరిగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గౌడ ఆత్మీయ సమ్మేళనం వాయిదా పడింది. దీంతో తాండూరులో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహా ఆవిష్కరణకు బ్రేక్ పడింది. ఈ విషయాన్ని తాండూరు గౌడ సంఘం నాయకులు హరిగౌడ్ ప్రకటించారు. ఈనెల 28న తాండూరులో గౌడ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో పాటు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలతో పాటు రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరు కావాల్సి ఉందన్నారు. కాని 28వ తేదిన యాదాద్రి దేవాలయ పునఃప్రారంభం జరుగుతుండడంతో ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితారెడ్డితో పాటు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు వెళ్లనున్నడంతో తాండూరులో నిర్వహించే గౌడ ఆత్మీయ సమ్మేళనాన్ని వాయిదా వేస్తున్నట్లు వివరించారు. త్వరలోనే మరో తేదిని ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

