పైలెట్ ఇంట బర్త్ డే సందడి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పైలెట్ ఇంట బర్త్ డే సందడి..!
– ఘనంగా జైదేవ్ రెడ్డి జన్మదినం
– కుమారున్ని ఆశీర్వదించిన ఎమ్మెల్యే దంపతులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇంట బర్త్ డే సందడి నెలకొంది. రోహిత్ రెడ్డి, ఆర్తీ రెడ్డిల కుమారుడు జైదేవ్ రెడ్డి 5వ జన్మదిన వేడుకలను ఆదివారం తాండూరు పట్టణంలోని వారి నివాసంలో ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో జైదేవ్ రెడ్డి చేత కేక్ కట్ చేయించారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, తల్లి ఆర్తి రెడ్డిలు జైదేవ్ రెడ్డిని ఆశీర్వదించారు. అదేవిధంగా నాన్నమ్మ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి, తాతయ్య విఠల్ రెడ్డిలతో పాటు కుటుంభీకులు జైదేవ్ రెడ్డిని సల్లంగా జీవించాలని దీవించారు. మరోవైపు సరిగ్గా ఐదేళ్ల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జైదేవ్ పుట్టిన రోజు ఎన్నికల నామినేషన్ ను సమర్పించారు. తాజాగా ఈ సారి ఎన్నికల్లో జైదేవ్ రెడ్డి 5 ఏండ్ల జన్మదినం జరుపుకోవడంతో వారి ఇంట బర్త్ డే సందడి ఏర్పడింది. గత విజయానికి సాక్షిగా నిలిచిన జైదేవ్‌ పుట్టిన రోజు ఈ సారి కూడా విజయానికి సాక్షిగా నిలుస్తుందని పైలెట్ ఫ్యామిలి అభిలాషించింది.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!