నిరుద్యోగులు ఉద్యోగ లక్ష్యాలను నెరవేర్చుకోవాలి

తాండూరు వికారాబాద్

నిరుద్యోగులు ఉద్యోగ లక్ష్యాలను నెరవేర్చుకోవాలి
– మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పద్దోళ్ల దీపా నర్సింలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలో ఒకటైన నియామకాల కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేశారని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని పాత విజ్ఞాన్ కళాశాల వద్ద ఉన్న ప్రగతి కోచింగ్ సెంటర్లో ఉద్యోగ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ సంబ‌రాలు జ‌రుపుకున్నారు. ఈ కార్యక్రమానికి వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు హాజరై నిరుద్యోగ యువతీ, యువకులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దీపా నర్సింలు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా నిరుద్యోగ యువత కోసం ఏకంగా 91,142 వేల ఉద్యోగ ప్రకటన చేశారన్నారు. ఇందులో 80వేల 39 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీకి ఆదేశించడం జరిగిందన్నారు. దీంతో నిరుద్యోగుల కలలను సీఎం కేసీఆర్ నిజం చేశారని అన్నారు. దీంతో పాటు ఉద్యోగాల కోసం 10 ఏండ్ల వయోపరిమితిని పెంచారని అన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకుని, ఉద్యోగాలను సాధించుకోవాలని అన్నారు. మరోవైపు ప్రగతి కోచింగ్ సెంటర్లో డైరెక్టర్ శ్రీశైలం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు లెట్ డీఎస్సీపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, అస్లాం, కోఆప్షన్ సభ్యులు సారంగా విజయ్ కుమార్, స్టేషన్ హనుమాన్ చైర్మన్ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.