లవంగం ‘టీ’తో లాభాలెన్నో..!
– ఇమ్యూనిటీ పెంచుకునేందుకు బెస్ట్ టిప్
– దగ్గు, గ్యాస్ సమస్యలకు చెక్
దర్శిని డెస్క్: వంటింట్లో ఉండే లవంగం మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు శరీరానికి మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తి పెంచడంలో, ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో లవంగం కీలక పాత్ర పోషిస్తుంది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న లవంగంతో టీ చేసుకుని తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ చలికాలంలో మరింత ప్రభావంతంగా పనిచేస్తాయని అంటున్నారు. లవంగం టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు అందరు తెలుసుకోండి.
చలికాలంలో చాలా మంది దగ్గు సమస్యతో బాధపడుతుంటారు. విపరీతమైన దగ్గు కారణంగా ఊపిరితిత్తుల సమస్యల బారిన పడుతుంటారు. కాబట్టి ఈ సమస్య నుంచి ఉపశమనం లభించడానికి లవంగాలతో చేసిన టీని తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు దగ్గు నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరంలో కఫాన్ని తొలగించేందుకు కూడా ఉపయోగపడుతాయి.
అధిక ఉష్ణోగ్రతతో ఇబ్బంది పడే వారికి లవంగం టీ మంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతీ రోజూ ఉదయం లవంగాలతో చేసిన టీని తాగితే శరీరంలోని ఉష్ణోగ్రతలు పెరగడం, తగ్గడం జరుగుతుంది. ఈ సమస్యకు లవంగాల టీతో చెక్ పెట్టొచ్చు.
జీర్ణక్రియ మెరగు
మరీ ముఖ్యంగా చలికాలంలో మనలో చాలా మంది జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. జీర్ణక్రియ మందగిస్తుంది, దీంతో మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు వెంటాడుతాయి. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం లభించాలంటే లవంగాలతో చేసిన టీని తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. లవంగాల టీని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగువుతుంది.
ఇదికూడా చదవండి…

