వంద వ్యాధులకు చెక్..!
– రణపాల ఆకులో ఔషధ గుణాలు
– కిడ్ని రాళ్లు, మూత్రపిండాల సమస్యలు దూరం
దర్శిని డెస్క్ : వంద నుంచి 150 రోగాల సమస్యలకు ఈ ఒక్క ఆకే చెక్ పెడుతుంది. అదే మన ఇంటి సంజీవనీగా పిలుచుకునే రణపాల ఆకు. ప్రకృతి నుంచి లభించే ఈ రణపాల ఆకులో ఎన్నో వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఓ ఆకుని కోసి చక్కగా కడిగి నోట్లో పెట్టుకుని తమలపాకులా నమిలేయండి. చేదుగా ఉంటుందనో తింటే ఏమవుతుందోనని భయపడక్కర్లేదు. వగరూ పులుపూ కలిసిన రుచితో ఉండే ఈ ఆకు అనారోగ్య సమస్యలు ఉంటే మందుగా పనిచేస్తుంది. లేదంటే అందులోని ఔషధ గుణాలు రోగాల్ని అడ్డుకుంటాయి అంటున్నారు సంప్రదాయ వైద్య నిపుణులు.
ఈ మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్,యాంటీ హిస్టామైన్ తోపాటు అనాఫీలాక్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. కనుక దీని ఆకు తినడం ద్వార, కషాయం తయారు చేసి తీసుకోవడం ద్వార, ఆకు రుబ్బి కట్టు కట్టడం ద్వార చాల ఉపయోగాలు ఉన్నాయి. దీని ఆకులు తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ ని క్రమబద్దీకరిస్తుంది. కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. మీరు కిడ్నీలో రాళ్ల సమస్యతో పోరాడుతున్నట్లయితే, మీరు రణపాల ఆకులను ఉపయోగించవచ్చు. కిడ్నీలో రాళ్లను తొలగించడానికి కూడా రణపాల ఉపయోగపడుతుంది.
కిడ్నీ స్టోన్స్ కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలతో తయారవుతాయి. స్టోన్క్రాప్ మొక్కలో సపోనిన్లు ఉంటాయి. ఇవి కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలను విచ్ఛిన్నం చేయగలవు. ఈ మొక్క ఆకులను తీసుకోవడం వల్ల మీ జీవితంలో రాళ్ల సమస్య ఉండదంటున్నారు. దీని ఆకులని వేడిచేసి గాయాల పైన పెట్టడడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. ఈ ఆకులని నూరి పొట్టుగా తల పైన పెట్టుకోవడం వల్ల తల నొప్పి తగ్గుతుంది. ఈ ఆకుల పసరుని రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవినొప్పి తగ్గుతుంది. రోజు ఈ ఆకుల్ని తినడం ద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది. అదేవిధంగా క్యాన్సర్, బ్లడ్ షుగర్, ఫంగస్, వాపు, పొట్టలో పుండు, కాలేయ సమస్య, మూత్రపిండాల్లో రాళ్లు మొదలైన సమస్యలతో పోరాడే శక్తి దీనికి ఉంది.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి.
ఇది కూడా చదవండి…

