బీఆర్ఎస్‌ పట్టణ అధ్యక్షుడిపై అట్రాసిటీ

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్ఎస్‌ పట్టణ అధ్యక్షుడిపై అట్రాసిటీ
– హోటల్‌ ఘర్షణలో ఇరువర్గాలపై కేసు
– వెల్లడించిన తాండూరు పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షుడిపై పోలీస్టేషన్‌ లో అట్రాసిటీ కేసు నమోదయ్యింది. సోమవారం రాత్రి తాండూరు పట్టణంలోని రైల్వే స్టేషన్‌ సమీపంలో ఓ హోటల్‌ వద్ద ఇరు వర్గాలు ఘర్షణ పడిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్‌ పట్టణ అధ్యక్షులుగా ఉన్న అఫ్పూ(నయూం), అతని అనుచరులు, హోటల్‌ నిర్వహకులతో షెడ్డు నిర్మాణం విషయంలో ఘర్షణ జరిగింది. ఇరువర్గాల మద్య మాటా మాట పెరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘటనలో ఇరు వర్గాలు పట్టణ పోలీస్టేషన్‌ లో పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు.

ఈ మేరకు ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు అఫ్పూ(నయూం), అతని అనుచరులపై కేసు నమోదు చేయడం జరిగిందని, హోటల్‌ సంబంధికులపై కేసులు నమోదు చేయడం జరిగిందని పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. అయితే హోటల్‌ వర్గంకు చెందిన రాహుల్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులుగా ఉన్న అఫ్పూపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగిందని వెల్లడించారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!