గొప్ప వీరుడు సర్వాయి పాపన్న గౌడ్
– తాండూరులో ఘనంగా జయంతి వేడుకలు
– నివాళులు అర్పించిన ఆర్డీఓ, గౌడ సంఘం నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: అరాచక పాలనపై తిరుగుబాటు చేసిన తెలంగాణ వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని పలువురు అభివర్ణించారు. గురువారం తాండూరులో సర్వాయి పాపన్న గౌడ్ 372 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో అధికారికంగా జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అశోక్ కుమార్, గౌడ సంఘం నాయకులు, ప్రజా ప్రతినిధులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా గౌడ సంఘం అధ్యక్షులు రాజుగౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని పోట్లీ మహరాజ్ చౌరస్తా వద్ద జయంతిని నిర్వహించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ దీప నర్సింలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ రవీందర్ గౌడ్, గ్రంథాయల సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, ప్రవీణ్ కుమార్ గౌడ్, వెంకన్న గౌడ్, సంగీత ఠాకూర్, మాజీ కౌన్సిలర్లు సుమిత్ గౌడ్, హరిహర గౌడ్, దేవాలయ చైర్మన్ రాజన్ గౌడ్, నాయకులు నర్కుల నరేందర్ గౌడ్, నారాయణ గౌడ్, మనోజ్ గౌడ్, సంతోష్ గౌడ్, రాకేష్ గౌడ్,రఘు గౌడ్‌తో పాటు బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, షుకూర్, పూజారి పాండు, బంటారం భద్రేశ్వర్, కులకర్ణి ప్రశాంత్, శివానంద్ గౌడ సంఘం పెద్దలు పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ తెలంగాణలో అన్ని కులాలను, మతాలను ఏకం చేసి ఆనాటి పాలకుల అరాచకాలపై తిరుగుబాటు చేసిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.


