ఫోస్టాఫీసులో అధిరిపోయే స్కీమ్..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ఫోస్టాఫీసులో అధిరిపోయే స్కీమ్..!
– నెలవారి పెట్టుబడితో లక్షలు పొందే అవకాశం
– ప్రైవేటు బ్యాంకు స్కీమ్‌లతో పోటీ
దర్శిని డెస్క్ : ఫిక్స్‌డ్ డిపాజిట్‌ ద్వారా డబ్బులు సంపాదించుకునేలా వారికి ఫోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. ఎలాంటి రిస్క్‌ లేకుండా డబ్బులకు ఆధాయం పొందొచ్చు. రూ. 12 లక్షల వరకు డబ్బులు పొందొచ్చు. ఎస్బీఐ బ్యాంకుతో ఈ ఫోస్టాఫీసు స్కీమ్ పోటీ పడుతుంది. అదే రికరింగ్​ డిపాజిట్​ స్కీమ్​​.

రికరింగ్​ డిపాజిట్​ అంటే ఏమిటి..?
రికరింగ్​ డిపాజిట్స్​ అనేవి ఓ ప్రత్యేకమైన టర్మ్​ డిపాజిట్లు. వీటి సేవలు దేశంలోని వివిధ బ్యాంకులతో పాటు పోస్ట్​ ఆఫీసుల్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఈ తరహా డిపాజిట్​ స్కీమ్స్​.. వినియోగదార్లు ప్రతినెలా నిర్దేశిత మొత్తాన్ని బ్యాంకులో లేదా తపాలా కార్యాలయంలో జమ చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తాయి. ఫలితంగా ఆర్​డీ ఖాతాలు తెరచినవారు రెగ్యులర్​గా ఫిక్స్​డ్​ ఇంట్రెస్ట్​ రేట్​ పద్ధతిలో ఆదాయాన్ని పొందవచ్చు. ఈ వడ్డీ రేట్లు అనేవి బ్యాంకు, ఎన్​ఎఫ్​బీసీల నిబంధనలకు అనుగుణంగా మారుతుంటాయి.

రికరింగ్​ డిపాజిట్లు: రికరింగ్​ డిపాజిట్స్​ అనేవి ఓ ప్రత్యేకమైన టర్మ్​ డిపాజిట్లు. అయితే తక్కువ సమయంలో భారీ లాభాలు పొందాలనుకునే వారికి పోస్టాఫీసు రికరింగ్​ డిపాజిట్​ మంచి ఎంపిక. ఈ పథకంలో మీరు నెలా నెలా తమకు నచ్చినంత పొదుపు చేసుకోవచ్చు. ప్రస్తుతం 2024, ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి 6.7 శాతం మేర వడ్డీ అందిస్తోంది కేంద్రం. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత కావాలనుకుంటే ఈ పథకాన్ని మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. కనీసం రూ.100 నుంచి ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠంగా ఎంతైనా పెట్టవచ్చు. దానికి పరిమితి లేదు. అయితే రానున్న త్రైమాసికానికి స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. అది ఇందులో ఇన్వెస్ట్ చేసే వారికి అదనపు ప్రయోజనం కల్పిస్తుంది.

చక్రవడ్డీ ప్రయోజనం
పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ప్రస్తుతం 6.7 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. మీరు పోస్ట్ ఆఫీస్ RD పథకంలో 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, మీరు ఈ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించుకోవచ్చు. ఈ పోస్టాఫీసు పథకంలో మీరు కనీసం రూ. 100 పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, గరిష్ట పెట్టుబడి మొత్తం పరిమితిని నిర్ణయించలేదు. ఈ పథకంలో మీరు చక్రవడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు.

రూ. 12లక్షలు పొందే అవకాశం
పోస్టాఫీస్ ఆర్డీ పథకంలో ప్రతి నెలా రూ.7,000 ఇన్వెస్ట్ చేస్తే, ఐదేళ్లలో మొత్తం రూ.4,20,000 పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుత వడ్డీ రేటు 6.7 ఆధారంగా లెక్కిస్తే, ఐదేళ్లలో మీరు మీ పెట్టుబడిపై దాదాపు రూ.79,564 వడ్డీని పొందుతారు. ఈ విధంగా మీరు ఐదేళ్ల తర్వాత దాదాపు రూ.4,99,564 వస్తుంది. దీని తరువాత, మీరు ఆర్‌డి పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తే, ఈ పరిస్థితిలో మీరు సుమారు రూ. 12 లక్షల నిధిని సేకరించవచ్చు. ఈ పోస్టాఫీసు స్కీమ్‌లో ఒకే ఖాతా కాకుండా, మీరు ముగ్గురు వ్యక్తుల జాయింట్ ఖాతాను కూడా తెరవవచ్చు.

ఇదికూడా చదవండి..

లవంగం నీళ్లు ఆరోగ్యానికి మేలు..!