తాండూరులో ఉచిత మెగా హెల్త్ క్యాంపు

ఆరోగ్యం తాండూరు రాజకీయం లైఫ్-స్టైల్ వికారాబాద్

తాండూరులో ఉచిత మెగా హెల్త్ క్యాంపు
– పరీక్షల తరువాత మందులు కూడా ఫ్రీ
– ఏర్పాట్లు చేసిన జమియతే ఉలేమా ఏ హింద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ ప్రజలకు జమియతే ఉలేమా ఏ హింద్ సభ్యులు శుభవార్త చెప్పారు. ఆదివారం తాండూరులో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వికారాబాద్‌ జిల్లా జమియతే ఉలేమా ఏ హింద్, హైదరాబాద్‌ ముజ్తబా హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేర్ హస్పిటల్, ఎన్టీఆర్ ట్రస్ట్, ఇంటిగ్రో హస్పిటల్ తదితర సంస్థల సహాకారంతో ఈ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాండూరు పట్టణం అంతారం రోడ్డు మార్గంలోని వైట్ ప్యాలెష్‌లో ఉదయం 9గంటల నుంచి క్యాంపు ప్రారంభమవుతుందని తెలిపారు.

ఇందులో జనరల్‌ ఫిజీషియన్, కార్డియాలజిస్ట్, ఎముకలు, కీళ్ల వ్యాధి వైద్యులు, ఛాతీ, ఊపిరితిత్తుల వ్యాధుల వైద్యులు, మూత్రపిండాల వైద్యులు, కిడ్ని వ్యాధి వైద్యులు, గైనకాలజిస్టు వైద్యులు హాజరై వైద్య పరీక్షలు చేస్తారని తెలిపారు. అదేవిధంగా బీపీ, బరువు, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్, ప్రోస్టేట్, ప్రోస్టేట్ క్యాన్సర్, కీడ్ని పనితీరు, మూత్ర పరీక్షలు వంటి వాటికి ఉచితంగా పరీక్షలు చేసుకోవచ్చన్నారు. అవసరమైన అన్ని మందులను ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఎమర్జెన్సీ లైఫ్‌ సేవింగ్ బీఎల్ఎస్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలు ఈ ఉచిత వైద్య శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జమియతే ఏ ఉలేమా హింద్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహెమాన్ అతహర్ ఖాస్మీ సూచించారు.  పూర్తి వివరాలకు సెల్: 9000508991, 8331960001, 8328569686, 9848592972లకు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

మహిళల సంక్షేమమే ధ్యేయం..!