పోట్లీ మహారాజ్ గుడి చైర్మన్‌గా సుదర్శన్‌గౌడ్‌ను ప్రకటించాలి
– ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి గౌడ సంఘం నాయకుల విజ్ఞప్తి
– సానుకూల స్పందనపై హర్షం వ్యక్తం చేసిన నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని శ్రీ సద్గురు పోట్లీ మహారాజ్ దేవాలయ చైర్మన్‌గా గోరేపల్లి సుదర్శన్‌గౌడ్‌ను నియమించాలని గౌడ సంఘం నాయకులు ఎమ్మెల్యే బూయ్యని మనోహర్‌రెడ్డిని కోరారు.

ఆలయ చైర్మన్ పదవిని గౌడ సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయిస్తూ వస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా తమ వర్గానికి అవకాశం కల్పించాలని వారు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆలయ చైర్మన్‌గా ప్రసాద్‌గౌడ్ కొనసాగుతున్న నేపథ్యంలో తదుపరి చైర్మన్ పదవికి సుదర్శన్‌గౌడ్ పేరును గౌడ సంఘం నాయకులు ప్రతిపాదించినట్లు చెప్పారు.

ఈ అభ్యర్థనపై ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. గౌడ సంఘం నాయకుల అభ్యర్థనను ఎమ్మెల్యే పరిగణనలోకి తీసుకోవడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సుదర్శన్‌గౌడ్ అభ్యర్థిత్వాన్ని త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని ఆశిస్తున్నట్లు ప్రభాకర్‌గౌడ్ తెలిపారు.

గౌడ సంఘం విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీగౌడ్, మాజీ చైర్మన్ ప్రవీణ్‌గౌడ్, గౌడ సంఘం నాయకులు రాజుగౌడ్, రవిగౌడ్, రమేష్‌గౌడ్, వెంకటరాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


