మెడికల్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

మెడికల్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్..!
– వికారాబాద్ జిల్లా కాలేజీలో పోస్టులు
– అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : మెడికల్ స్టూడెంట్స్‌కు వికారాబాద్ జిల్లా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ గుడ్‌న్యూస్ చెప్పింది. కళాశాలలో పలు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.మల్లికార్జున్‌ ఓ ప్రకటనలో తెలిపారు. వికారాబాద్‌ లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో 52 పోస్టులకు దరఖాస్తులను కోరడం జరుగుతుందన్నారు. ఇందులో ల్యాబ్ అటెండెంట్ – 15 పోస్టులు, డాటా ఎంట్రీ ఆపరేటర్ – 07 పోస్టులు, రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్ – 03 పోస్టులు, సిటీ స్కాన్ టెక్నీషియన్ – 03 పోస్టులు, ఈసీజీ టెక్నీషియన్ – 02 పోస్టులు, అనస్థీషియా టెక్నీషియన్ – 04 పోస్టులు, దోబి – 04 పోస్టులు, ఎలక్ట్రిషన్ – 02 పోస్టులు, ప్లంబర్ – 01 పోస్టు, డ్రైవర్ (హెవీ వెహికల్) – 01 పోస్టు, థియేటర్ అసిస్టెంట్ – 04 పోస్టులు, గ్యాస్ ఆపరేటర్ – 02 పోస్టులు, వార్డ్ బాయ్ – 04 పోస్టులు ఉన్నట్లు వెల్లడించారు. పొరుగు సేవల పద్ధతిలో పోస్టులను భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈనెల 27, 28 మరియు 30వ తేదీలలో కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించబడతాయని, పూర్తి వివరాలకు www.gmcvikarabad.org వెబ్ సైట్ ను సందర్శించవచ్చని సూచించారు.

ఇదికూడా చదవండి…

విద్యార్థులకు మరో అవకాశం…!