పార్థివదేహానికి నివాళులు అర్పించిన కేపీఆర్
– మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలం జుంటుపల్లిలో ఆనారోగ్యంతో మరణించిన మృతురాలి పార్థివ దేహానికి సీనీయర్ నాయకులు, మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తం రావు(కేపీఆర్) నివాళులు అర్పించారు. గ్రామానికి చెందిన మంతటి బసప్ప తల్లి అనంతమ్మ గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శనివారం కన్నుమూసింది. ఈ విషయం తెలుసుకున్న కరణం పురుషోత్తంరావు మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, పలువురు నాయకులతో కలిసి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతమ్మ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బసప్పకు మనోధైర్యం చెప్పారు.
ఇదికూడా చదవండి…

