భళా.. భవిష్య రెడ్డి..!

కెరీర్ క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

భళా.. భవిష్య రెడ్డి..!
– క్రికెటర్‌గా రైతు కూతురు సత్తా
– అండర్‌ 15 రాష్ట్ర జట్టులో చోటు 
– యువతి, కోచ్‌లకు సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతు కూతురుగా ఉండి క్రికెట్‌ క్రీడా రంగంలో సత్తా చాటిన భవిష్య రెడ్డిని పలువురు భళా అంటూ అభినందించారు. తాండూరు పట్టణం మల్‌ రెడ్డికి చెందిన సి.కరుణార్‌ రెడ్డి, మమతారెడ్డిల కూతురు భవిష్య రెడ్డి. కరుణాకర్ రెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయన కూతురు భవిష్య రెడ్డి చిన్నతనం నుంచే క్రికెట్‌ క్రీడపై ఆసక్తిపెంచుకుంది. కూతురు అభిరుచి మేరకు తల్లిదండ్రులు క్రికెట్‌లో రాణించేందుకు ప్రోత్సహించారు. ప్రస్తుతం 12ఏండ్లు ఉన్న భవిష్య రెడ్డి హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో బీసీసీఐ గర్ల్స్ అండర్ 15 రాష్ట్ర జట్టులో క్రికెటర్‌గా ఎంపికైంది.

వికారాబాద్‌ జిల్లా నుంచి అతిచిన్న వయస్సుల్లో ఈ ఘనత సాదించడం మొట్ట మొదటిసారి. ఇందుకు శుక్రవారం రాష్ట్ర జట్టుకు ఎంపికై క్రీడాకారిణి భవిష్య రెడ్డి, లెజండరీ క్రికెట్ అకాడమి కోచ్‌లు ఎండి సాహిల్, ఎండీ సోహెల్‌లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పలువురు భవిష్య రెడ్డిని భళా అంటూ అభినందించారు. భవిష్య రెడ్డిని రాష్ట్ర జట్టుకు ఎంపికకావడంతో భాగస్వాములైన కోచ్‌ల కృషిని కొనియాడారు. తమ కూతురు ఇంతటి స్థాయి రావడానికి కారణమైన కోచ్‌లకు భవిష్య రెడ్డి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర జట్టుకు ఎంపికైన భవిష్యరెడ్డి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

శభాష్ శివకుమార్…!