చెరుకు డబ్బాలపై కొరడా..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

చెరుకు డబ్బాలపై కొరడా..!
– దగ్గరుండి తొలగించిన మున్సిపల్ సిబ్బంది
– ట్రాఫిక్ అంతరాయం పట్ల చర్యలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ట్రాఫిక్ కు అంతరాయంగా మారిన చెరుకు డబ్బాలపై తాండూరు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. వేసవి సందర్భంగా రెండు రోజుల క్రితం తాండూరు పట్టణంలోని కోర్టుకు సమీపంలో కొందరు వ్యక్తులు రోడ్డుపై చెరుకు డబ్బాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ మార్గంలో నిత్యం రద్దీ ఉండడంతో ఏర్పాటు చేసిన డబ్బాల వల్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది. దీనిపై కొందరు ఫిర్యాదులు చేయడంతో శుక్రవారం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది డబ్బాలను తొ లగించే పనులు చేపట్టారు. మున్సిపల్ జేసీబీ సహాయంతో ఈ మార్గంలో ఉన్న రెండు, మూడు డబ్బాలను తొలగించారు.

ఇదికూడా చదవండి…

రైల్వేలో కొత్త సూపర్ యాప్..!