పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి
– మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్
– మేరీ లైఫ్, మేరా స్వచ్ఛ షహేర్ పై అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి: పరిసరాల పరిశుభ్రతకు అందరు ప్రాధాన్యమివ్వాలని తాండూరు మున్సిపల్ 25 వ వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అన్నారు. మేరీ లైఫ్, మేరా స్వచ్ఛ షహేర్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం 25 వార్డులో అవగాహన ర్యాలీ, కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ స్వచ్ఛ కోసం ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రాధాన్యమివ్వాలన్నారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు వేరుగా అందించి.. రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్(ఆర్ఆర్ఆర్) పై అవగాహన పెంచుకోవాలన్నారు. పట్టణంలో వార్డును స్వచ్ఛతలో ఆదర్శంగా నిలిపేందుకు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ శానిటిరి ఇను స్పెక్టర్ కృష్ణ, మెప్మా ప్రతినిధి సరిత, ఎన్విరాల్ మెంట్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్, జవాన్లు రవి, భూపతి, కార్మికులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…
స్కూల్లో బ్రేక్‌ ఫాస్ట్..!
– సర్కారు బడులలో అమలు
– వచ్చే ఏడాది నుంచి కొత్త మెను
https://dharshininews.com/17189
chaithany collage