అయోధ్య రామ దర్శనంలో మార్పులు..!
– దర్శన వేళలను ప్రకటించిన ట్రస్టు సభ్యులు
– ఎందుకోసం నిర్ణయం తీసుకున్నారంటే..?
దర్శిని డెస్క్ : అయోధ్య వెళ్లే రామ భక్తులకు శ్రీ రామ జన్మభూమి ట్రస్టు సభ్యులు కీలక సూచన చేశారు. ఆలయంలో బాల రాముని దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. ఇదివరకు అంటే జనవరి 26 నుండి ఉదయం 5 గంటల నుండి రాత్రి 10.30 గంటల వరకు దర్శనాలను అనుమతించడం జరిగిందని ప్రస్తుతం ఈనెల 6వ తేది నుంచి ఈ దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా సందర్భంగా అయోధ్యకు వచ్చే భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకుని, రోజువారీ దర్శన క్రమం మారిందని చెప్పారు.
ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే సాధారణ దర్శనాన్ని ఇకపై గంట ముందుగా అంటే ఉదయం 6 గంటల నుంచే కల్పిస్తామని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. రాత్రి 9.30 గంటలవరకు ఉన్న దర్శన వేళలను 10 గంటలవరకూ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. భక్తులు ఇప్పుడు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9.30 గంటల వరకు బాలరాముడిని దర్శించుకునే అవకాశం దక్కింది.
ఇదికూడా చదవండి…

