ఫస్ట్ డే.. నో’టెన్’షన్..!
– తాండూరులో పదోతరగతి పరీక్షలు ప్రశాంతం
– 13 కేంద్రాల్లో 15 మంది గైర్హాజరు
– బందోబస్తు నిర్వహించిన పోలీసులు
– కేంద్రాలను పరిశీలించిన సబ్ కలెక్టర్
– పర్యవేక్షించిన డీఎస్పీ, తహసీల్దార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పదోతరగతి పరీక్షలపై అధికారులు చేపట్టిన చర్యలు ఫలించాయి. ఫస్ట్ డే ఎలాంటి ‘టెన్’షన్ లేకుండా తాండూరు పట్టణం, తాండూరు మండలంలో శుక్రవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. పదో తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని మొత్తం 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

తాండూరు పట్టణంలో 11 కేంద్రాలు, తాండూరు మండలంలో మల్కాపూర్, కరణ్ కోట్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో ఉదయం 9-30 గంటల నుంచి మధ్యాహ్నం 12-30 గంటల వరకు పరీక్ష జరిగింది. పరీక్ష సమాయానికంటే ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష పర్యవేక్షకులు ప్రతి విద్యార్థిని పరిశీలించి లోపలికి అనుమతించారు. నిర్ణీత సమయానికి 5 నిమిషాల అనుమతి ఉండండంతో ఒక్కరు కూడా ఆలస్యంగా హాజరైన సంఘటనలు నమోదు కాలేదు.

తొలిరోజు 2277 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా మొత్తం 13 కేంద్రాలలో 15 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు విద్యాధికారి వెంకటయ్య గౌడ్ తెలిపారు. మరోవైపు పదో తరగతి పరీక్షా కేంద్రాలను తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ పరిశీలించారు. పట్టణంలోని ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాల, జీజేసీ పాఠశాలలో పరీక్షా నిర్వహణను పరిశీలించారు. అదేవిధంగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, తహసీల్దార్ తారాసింగ్, ఎంపీడీఓ విశ్వప్రసాద్ లు పరీక్షలను పర్యవేక్షించారు. మరోవైపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దీంతో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరగడంతో అధికారులు, నిర్వహకులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదికూడా చదవండి…

