ఫ్రీ ఎంసెట్ కోచింగ్‌కు రెస్పాన్స్..!
– ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సెంటర్లో జోరందుకున్న అడ్మిషన్లు
– 24వరకు అడ్మిషన్లు, అదే రోజు నుంచి తరగతులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : నిరుపేద ఇంటర్ విద్యార్థుల కోసం తాండూరు ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచితంగా ఎంసెట్ కోచింగ్ పుల్ రెస్పాన్స్ వస్తుందని అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు.అసోసియేషన్ ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా ఉచితంగా ఎంసెట్ కోచింగ్ తరగతులు నిర్వహిస్తున్నారు. తాజాగా మూడో ఏడాది కూడా ఉచిత ఎంసెట్ కోచింగ్ నిర్వహించేందుకు నిర్ణయించారు.

ఈ ఫ్రీ ఎంసెట్ కోచింగ్ కోసం ఇంటర్ విద్యార్థుల నుంచి ఈనెల 15 నుంచి 24వ తేది వరకు అడ్మిషన్లు నమోదు చేసుకుంటున్నారు. 24వ నుంచి ఏప్రిల్ 27వ తేది వరకు తరగతులు కొనసాగుతాయని సభ్యులు తెలిపారు. అనుభవం ఉన్న అద్యాపకులతో తరగతులు జరుగుతాయన్నారు. అడ్మిషన్లు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. అసక్తిగల విద్యార్థులు అడ్మిషన్లు పొందవచ్చని సూచించారు. పేద విద్యార్థులు వేల రూపాయిలు ఖర్చు చేసుకోకుండా అసోసియేషన్ ద్వారా ఉచితంగ అందిస్తున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అతహర్, ఉపాధ్యక్షులు ఎండీ బాసిత్ అలీ, అబ్దుల్ సలీం, అబ్దుల్ ఖవి, ఖలీల్ఉల్లా షరీఫ్, ప్రధాన కార్యదర్శి ఖాలిద్ సైఫుల్లా, ఎండీ యూనుస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఖయ్యూం అతహర్, ఎండీ అజహర్, కోశాధికారి ఎండీ సిరాజ్, సభ్యులు ఖయ్యూం పాష, ముస్తాఖ్, లతీఫ్, సయ్యద్ అర్షద్, వసీంలు సూచించారు.

ఇదికూడా చదవండి…

