ఎమ్మెల్యేను సన్మానించిన భద్రేశ్వర దేవాలయ కమిటి
– జాతర ఉత్సవాల జయప్రదం పట్ల సత్కారం
– సహకరించిన నేతలకు కూడా సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని ప్రసిద్ధ బావిగి భద్రేశ్వర దేవాలయ రేనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, పాలకవర్గ సభ్యులు సన్మానించారు. గత నెలలో ప్రారంభమైన భద్రేశ్వర జాతర ఉత్సవాలు జయప్రదంగా ముగియడం పట్ల ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఆలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి సన్మానించారు.

జాతర ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహించేందుకు సహకరించడం పట్ల ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా జాతర ఉత్సవాల ప్రశాంతంగా జరిగేలా తోడ్పాటు అందించిన ఆర్బీఓఎల్ సీఈఓ, బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, తాండూరు రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, ఎక్సైజ్, ఫైర్, వైద్య శాఖ తదితర శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీ గౌడ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, వీర శైవ సమాజం సభ్యులు జొన్నల బస్వరాజ్, దేవాలయ కమిటి సభ్యులు కోటం సిద్ధలింగం, జక సంగమేశ్వర్, శెట్టి సురేష్, గాండ్ల వీరణ్ణ, బస్వరాజ్, ప్రశాంత్ కుమార్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

