దత్తాత్రేయ స్వామి సేవలో శంకరన్న..!

తాండూరు రాజకీయం వికారాబాద్

దత్తాత్రేయ స్వామి సేవలో శంకరన్న..!
– ఏరువాక పౌర్ణమి సందర్భంగా దర్శనం
– కుటుంభీకులు, మిత్ర బృందంతో కలిసి ప్రత్యేక పూజలు
– మైనంపల్లి కుటుంబంతో కలిసి భక్తులకు అన్నదానం
-పాల్గొన్న కుటుంభీకులు, మిత్రబృందం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కర్ణాటక రాష్ట్రం గానుగాపూర్ లో వెలసిన శ్రీ దత్తాత్రేయ స్వామి సేవలో తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత శంకర్ యాదవ్ తరించారు. బుధవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా కుటుంబ సభ్యులు, మిత్ర బృందంతో కలిసి దేవాలయాన్ని సందర్శించారు.

ఆలయ పురోహితుల సమక్షంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితుల ఆశీర్వవచనాలు తీసుకున్నారు. అనంతరం దేవాలయ ఆవరణలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వారితో కలిసి శంకర్ యాదవ్, సతీమణి చంద్రకళ, మిత్ర బృందం సభ్యులు అన్నదానం చేశారు. శంకర్ యాదవ్ చేస్తున్న దైవ సేవ, అన్నదాన సేవలను మైనంపల్లి హన్మంతరావు అభినందించారు.

అనంతరం శంకర్ యాదవ్ మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో అందరికి మంచి జరగాలని ప్రార్థించారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా కుటుంబ సభ్యులు, మిత్ర బృందంతో కలిసి దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దీంతో పాటు భక్తులకు అన్నదానం చేయడం సంతృప్తి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అడిషనల్ ఎస్పీ మధుసూదన్ రావు, కుటుంభ సభ్యులు, మిత్రబృందం కందుకూరి రాజ్ కుమార్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, మాజీ ఎంపీపీ రాములు, పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, బంటు మల్లప్ప, జొన్నల వినోద్ కుమార్, మనోహర్ యాదవ్, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

కేసీఆర్ పై కుట్రలు పారవు..!