అగ్నికి ఫంక్షన్ హాల్ బుగ్గి..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

అగ్నికి ఫంక్షన్ హాల్ బుగ్గి..!
– షాక్ సర్క్యూట్ తో ఎగిసిన మంటలు
– బూడిదైన ఫర్నిచర్, వస్తువులు
– వీరశైవ సమాజం ఫంక్షన్ హాల్లో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : షాక్ సర్క్యూట్ వల్ల ఓ ఫంక్షన్ హాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫంక్షన్ హాల్లో ఫర్నీచర్, వస్తువులు బుగ్గిపాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం ఉదయం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. తాండూరు పట్టణం చెరువెంటి ఈశ్వరాలయం సమీపంలో వీరశైవ ఫంక్షన్ హాల్ కొనసాగుతోంది.

మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఫంక్షన్ హాల్ లో మంటలు ఎగిసి పడ్డాయి. కాసేపటికే మంటలు ఫంక్షన్ హాల్ మొత్తం వ్యాపించాయి. ఈ మంటల్లో ఫంక్షన్ హాల్లోని కుర్చీలు, కూలర్లు, ఇతర వస్తువులతో పాటు ఫైభాగంలో ఉన్న డెకరేషన్ వస్తువులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న తాండూరు ఫైర్ స్టేషన్ ఆఫీసర్ జలంధర్ రెడ్డి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు.

అప్పటికే భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. అయితే షాక్ సర్య్కూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు రూ. 15లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు నిర్వహకులు తెలిపారు. మంగళవారం ఎలాంటి ఫంక్షన్ లేవని, ఫంక్షన్ ఉంటే భారీ ప్రమాదం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో మంటలు అర్పేందుకు ఫైర్ స్టేషన్ సిబ్బంది సునీల్, రవి, ఇబ్రహీం, సంతోష్, మధుసూధర్ రెడ్డి, రఘుపతి రెడ్డి తదితరులు సేవలందించారు.

ఇదికూడా చదవండి…

మేడిపండుతో మస్తు ఆరోగ్యం..!