
బీసీ గురుకులాల గతి మార్చండి..!
– విద్యార్థులకు అనుగుణంగా సీట్లు పెంచాలి
– సొంత భవనాలు నిర్మించి సౌకర్యాలు కల్పించాలి
– బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ గురుకుల పాఠశాల గతిని మార్చాలని, విద్యార్థులకు అనుగుణంగా సీట్లను పెంచి.. అన్ని సౌకర్యాలు కల్పించేలా చూడాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ డిమాండు చేశారు. శనివారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మహాత్మ జ్యోతిబాబపూలే బీసీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను రాజ్ కుమార్, సంఘం నాయకులతో కలిసి సందర్శించారు.

పాఠశాల ప్రిన్సిపల్ నరేష్, విద్యార్థులతో మాట్లాడి పలు విభాగాలను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు సరైన వసతులు లేదని, విద్యార్థులకు అనుగుణంగా సీట్లు లేవని గుర్తించారు. డైనింగ్ హాల్ లేక నేలపై కూర్చుని తింటున్నారని తెలుసుకున్నారు. పాఠశాలో రెండో అంతస్తులో రేకుల షెడ్ ఉండడంతో వర్షాకాలం ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు అనుగుణంగా సీట్లను పెంచాలని అన్నారు.

పాఠశాలకు సొంత భవనాలను నిర్మించి అందులో అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించాలని డిమాండు చేశారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, యాలాల మండల అధ్యక్షులు లక్ష్మణ చారి, పెద్దేముల్ మండల యువజన సంఘం అధ్యక్షులు నవీన్, సోషల్ మీడియా ఇంచార్జ్ బసవరాజు, యువనాయకులు రాజుగౌడ్, వివేక్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

