ఆర్టీసీకి మహాలక్ష్మీ పంట..!
– ఉచిత బస్సు ప్రయాణంతో సంస్థకు తోడ్పాటు
– 200 కోట్ల మంది వల్ల 6వేల కోట్ల ఆధాయం
– సంస్థకు మైలురాయిగా కాంగ్రెస్ ప్రభుత్వ పథకం
– తాండూరు ఆర్టీసీ డీపోలో సంబరాలు
– పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆర్టీసీ సంస్థకు ఆధాయ పంట పండించిందని తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు.

ఆర్టీసీ సంస్థలో ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 200ల కోట్ల మందికి పైగా మహిళలు ప్రయాణించడం వల్ల రూ. 6వేల 700 కోట్ల ఆదాయం వచ్చింది. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం తాండూరు ఆర్టీసీ డీపో మేనేజర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో బస్టాండ్ లో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, సోమశేఖర్, ప్రభాకర్ గౌడ్, పార్టీ అధ్యక్షులు హబీబ్ లాల, జిల్లా అధ్యక్షురాలు శోభారాణి, పట్టణ అధ్యక్షురాలు గాజుల మాధవిలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిందన్నారు. ఈ పథకం ద్వారా 200 కోట్ల మందికి పైగా మహిళలు ప్రయాణించడం రికార్డు నెలకొల్పడంతో సంతో షకరమన్నారు. దీంతో పాటు ఆర్టీసీ సంస్థకు రూ. 6వేల 700 కోట్ల ఆధాయం లభించడం ఆసంస్థకు మైలురాయిగా నిలుస్తోందన్నారు. ఈ పథకాన్ని వి జయవంతం చేయడంలో అధికారులు, డీపో మేనేజర్లు, సిబ్బంది. డ్రైవర్లు, కండక్టర్ల కృషి ఎంతో ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళతో పాటు ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. మరోవైపు సంబరాలను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన వ్యాసరచన పోటీలో ప్రతిభ కనబరిచిన కందనెల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని గాయత్రి, పూజ, ప్రసన్న, అనుబాయి, మదీనాలకు బహుమతులు అందజేశారు.

ఇదికూడా చదవండి…

