కట్ట మైసమ్మ.. కృప మెండుగా ఉండాలి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కట్ట మైసమ్మ.. కృప మెండుగా ఉండాలి..!
– తాండూరు ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్
– వైభవంగా భజన సమాప్తి ఉత్సవాలు
– దేవాలయంలో భక్తులకు అన్నదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కట్ట మైసమ్మ తల్లి కృప భక్తులందరిపై మెండుగా ఉండాలని తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ ప్రార్థించారు.

శనివారం తాండూరు పట్టణం ఆదర్శనగర్‌ పాత కుంటలోని దేవాలయంలో శ్రావణ మాసం భజన సమాప్తి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో కట్ట మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, అలంకరణలు చేశారు. తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వినాయక గ్రూప్స్ అధినేత వర్త్యా విఠల్ నాయక్ హాజరై దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం అమావాస్య సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదానంలో విఠల్ నాయక్ పాల్గొన్నారు. దేవాలయ కమిటి సభ్యులతో కలిసి భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కట్ట మైసమ్మ తల్లి ఏంతో మహిమాన్వితురాలు అని, కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా విరాజిల్లుతోందని అన్నారు. శ్రావణ మాసం సందర్భంగా దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అదేవిధంగా దేవాలయంలో గత రెండున్నర సంవత్సరాలుగా భక్తులకు అన్నదానం చేస్తున్న అలంపల్లి ప్రకాష్ కుటుంబ సభ్యులు, నర్సింలు కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటి సభ్యులు వేణుగోపాల్, నరేష్, నవీన్ కంఠం, సుధాకర్, అంజిలయ్య, పాపయ్య, ఆలయ అర్చకులు చంద్రకాంత్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న మనోహరన్న