యాదవ తేజాలు..!
– అక్కా చెల్లెళ్లకు టీచర్ ఉద్యోగాలు
– సన్మానించిన యాదవ సంఘం సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : యాదవుల ఇంటికి చెందిన అక్కా, చెల్లెళ్లు సర్కారు టీచర్ల ఉద్యోగాలు సాధించి సంఘంలో తేజాలుగా నిలిచారు. ఇందుకు యాదవ సంఘం సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. వివరాల్లోకి వెళితే.. యాలాల మండలం జుంటుపల్లి గ్రామానికి చెందిన గొల్ల మొగులప్ప బషీరాబాద్ మండలం జీవనీలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ఆయన ఇద్దరు కూతుళ్లు గొల్ల వినేషా, గొల్ల శిరీషాలు ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో ఫలితాలలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులుగా ఎంపికయ్యారు.
ఇటీవలే ఉపాధ్యాయ బాధ్యతలు తీసుకున్నారు. ఇందులో భాగంగా మంగళవారం యాదవ సంఘం సభ్యులు ఇద్దరు అక్కా చెల్లెళ్లను ఘనంగా సన్మానించారు. యాదవుల బిడ్డలు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియామకం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రాజుయాదవ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి బస్వరాజ్ యాదవ్, మల్లేశం యాదవ్, గోపాల కృష్ణ యాదవ్, లాలు యాదవ్, లక్ష్మణ్ యాదవ్. గుండప్ప యాదవ్, గోపాల్ యాదవ్ తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

