బషీరాబాద్‌లో ‘రాయలసీమ’ కూత..!
– నవాంద్గిలో నిలిపేందుకు బోర్డు గ్రీన్ సిగ్నల్
– ఫలించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కృషి
– హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు, ప్రయాణికులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ రైల్వే స్టేషన్‌లో రాయలసీమ ఎక్స్‌ప్రెస్ కూత వినిపించబోతోంది. బషీరాబాద్‌లోని నావంద్గి రైల్వే స్టేషన్‌లో నిజమాబాద్ – తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలు నిలిపేంందుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

చాలా కాలంగా బషీరాబాద్‌లోని నవాంద్గి రైల్వే స్టేషన్‌లో రాయలసీమ ఎక్స్‌ప్రెస్ నిలపాలని ప్రజలు, ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్, తిరుపతి వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఇక్కడ ప్రజలకు రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలు అన్నివిధాలుగా సౌలభ్యంగా ఉంటుందని భావించి విజ్ఞప్తులు చేశారు. ఓ దశలో దీక్షలు కూడా చేపట్టారు.

చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రజలకు, ప్రయాణికులకు హామి ఇచ్చారు. ఇన్ని రోజుల తరువాత రైల్వే శాఖ బషీరాబాద్ నవాంద్గి రైల్వే స్టేషన్‌లో రాయలసీమను నిలిపేందుకు అంగీకరించింది. త్వరలోనే నవాంద్గి రైల్వే స్టేషన్‌లో రాయలసీమ కూత వినిపించబోతోంది. ఇందుకోసం కృషి చేసిన ఎంపి రంజిత్ రెడ్డికి, మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. రాయలసీమ హాల్టింగ్ వల్ల పరిసర ప్రాంతా ప్రజలకు ఎంతో మేలు జరగబోతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

