ఆరోగ్య మందారం..!
– దీని టీ తాగితే మస్త్ మస్త్ లాభాలు
– హై బీపీని తగ్గించే పోషకాలు
దర్శిని డెస్క్ : ఇటీవల కాలంలో లెమన్ టీ, గ్రీన్ టీ వంటి ఎన్నో రకాల టీ లు అందరు రుచి చూస్తున్నారు. వీటిని అలవాటు చేసుకోవడంలో ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయనుకోండి. ఇలాంటి టీ ల పక్కన ఇప్పుడు మందారం టీ కూడా చేరిపోయింది. లెమన్ టీ, గ్రీన్, బ్లాక్ కాఫీల మాదిరిగానే ఇందులో కూడా ఆరోగ్యాన్ని అందించే పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మందారం టీ లాభాలేంటో ఇక్కడ చూద్దాం..

ఈ టీని తాగడం వల్ల చక్కెర తక్షణమే నియంత్రణలో ఉంటుంది. మందార టీ తాగడం వల్ల ఊబకాయం, మధుమేహం వంటి ఇతర వ్యాధులకు గణనీయమైన ప్రయోజనాలు లభిస్తాయని అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. మందారం టీ తాగడం ద్వారా ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌తో పాటు ట్రైగ్లిజరాయిడ్ లెవెల్స్ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఫ్యాట్ సమస్యతో బాధపడేవారు ఈ మందారం టీ తాగడం మంచిది.

ఈ టీ రెగ్యులర్‌గా తాగడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే హైబీపీ సమస్యతో బాధపడేవారు ఈ హైబిస్కస్ టీ తాగడం మంచిది. హైబిస్కస్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఇంఫ్లమేషన్ తగ్గిస్తాయి. కీళ్లు, కండరాల్లో మంట, వాపు సమస్య రాకుండా కాపాడుతాయి. దీంతో ఆర్థరైటిస్ ముప్పు లేకుండా చూసుకోవచ్చు. హైబిస్కస్ టీలో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. అలాగే కెఫిన్ ఉండదు. కాబట్టి బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.

కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో మందారం టీ సహాయపడుతుంది. ఈ టీ కాలేయాన్ని పూర్తిగా శుభ్రం చేస్తుంది. తద్వారా కాలేయం సంబంధ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. అతద్వారా షుగర్ అదుపులో ఉంటుంది. చర్మం హైడ్రేట్ అవుతుంది.
హైబిస్కస్ టీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులోని పోషకాలు మెటబాలిజం రేటు మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు అదుపులో ఉంచుకోవచ్చు. అదేవిధంగా గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని చెబుతున్నారు. ధమనుల్లో పేరుకుపోయిన చెడు కొవ్వు కరిగించి రక్త ప్రసరణ మెరుగుపర్చడంలో ఈ హైబిస్కస్ టీ సహాయపడుతుంది. తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చుఇవి
( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)


