ఖర్జూరం విత్తనాలతో అదిరే లాభాలు..!
– వందల రోగాలను పోగొట్టే శక్తి
– ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోండి
దర్శిని డెస్క్ : ఖర్జూరం పండు గురించి పరిచయం అక్కర్లేదు. ఖర్జూరం పండుతో ఆరోగ్యానికి ఎన్నో లాభాలు దక్కుతాయి. ఖర్జూరం పండే కాదు దాని విత్తనాలతో శరీరానికి అదిరిపోయే లాభాలు ఉన్నాయని నిఫుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఖర్జూరం గింజల్లో కూడా చాలా పోషక విలువలను కలిగి ఉన్నాయి. ఖర్జూర విత్తనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని రుజువు చేస్తుంది. ఖర్జూర విత్తనాలు మీ గుండెను వ్యాధి నుండి రక్షించడంలో సహాయపడతాయి.
యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఖర్జూరం చర్మానికి మేలు చేస్తుంది. అయితే ఈ గింజలను నేరుగా తినలేరు కనుక.. ఖర్జూరపు గింజల పొడిని తయారు చేసుకుని ఉపయోగిస్తారు. ఖర్జూరం గింజల పొడి అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, జింక్, కాడ్మియం, కాల్షియం , పొటాషియంతో కూడిన సమ్మేళనాలను కలిగి ఉంటుంది.ఈ గింజలు DNA దెబ్బతినకుండా నిరోధించడం, రక్తంలో చక్కెర సమస్యల చికిత్సలో ఉపయోగపడతాయి.

ఖర్జూర విత్తనాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరం. రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. ఖర్జూరపు గింజల పొడి జీర్ణశయాంతర రుగ్మతలకు, ముఖ్యంగా దీర్ఘకాలిక విరేచనాలకు చికిత్స గా పనిచేస్తుంది
ఇలా తయారు చేసుకోవాలి
ఖర్జూర గింజలను శుభ్రంగా కడిగి, పొడిగా వేయించి, మెత్తగా పొడి చేసుకోవాలి. లేదంటే, దీనిని నీటిలో నానబెట్టి, మెత్తగా చేసి ఆరబెట్టవచ్చు. ఈ పొడి ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. కావాల్సినప్పుడు దానితో కొద్దిగా ఖర్జూరపు సిరప్, దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడిని మిక్స్ చేసి, వేడి పాలతో, లేద మరిగించి వడపోసి తాగొచ్చు. కావాలంటే ఇక్కడ మీరు కాఫీ పౌడర్ స్థానంలో ఖర్జూరపు గింజల పొడిని వాడుకోవచ్చు.

(గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా అందించటం జరిగింది. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు దర్శిని న్యూస్ బాధ్యత వహించదు.)

