మా యువతకు వివేకుడే స్పూర్తి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మా యువతకు వివేకుడే స్పూర్తి..!
– గాజీపూర్ గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలు
– జయంతితో.. ఆదర్శంగా నిలిచిన వైనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : యువతను మేలు కొలిపిన స్వామి వివేకానందుడే మాకు స్పూర్తి అంటున్నారు పెద్దేముల్ మండలంలోని గాజీపూర్ యువకులు. సోమవారం గ్రామంలో స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ తలారి వీరప్ప, తాజా ఉపసర్పంచ్ గడ్డమీద ఎల్లప్పలు, గ్రామస్తులు మాట్లాడుతూ అభివృద్ధిలో, సేవా కార్యక్రమం, క్రీడాల్లో అన్ని గ్రామాల కంటే గాజీపూర్ గ్రామ యువకులు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. దేశ జనాభాలో 65% శాతం యువకులే ఉన్నారన్నారు. కావున యువకులందరూ కూడా కలిసికట్టుగా ఉండి గ్రామ అభివృద్ధితో పాటు కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. గ్రామంలో ఏ జాతర జరిగిన మంచి చెడు ఏదైనా కూడా యువకులు ముందుండి నడిపించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు.

యువకులు అందరూ కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండి ..మంచి మార్గంలో సన్మార్గంలో నడవాలని కోరారు. గాజీపూర్ గ్రామ యువకులకు ఎప్పుడు కూడా అండగా ఉంటామని అన్నారు. అర్ధరాత్రి ఏ సమస్య వచ్చినా అందరం కలిసికట్టుగా సమస్యని పరిష్కరించుకుందామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కారుకొండలాలు, ముస్తఫా, వడ్ల సంగమేశ్వర్, దేశాయ్ శేఖర్, బ్యాగరి శంకరప్ప, హైమద్, బంగారి నరసింహులు, హెచ్ రాజు, కార్కొండ శీను, బుద్ధారం శ్రీశైలం , కోటపు గుండప్ప ,సరగళ్ల బాలు, దేశాయి శ్రీను ,చాకలి అనిల్, బాలు ,రాజు, దేశాయి అనిల్ ,నాగులపల్లి రాజు మహేష్, మంగళి కృష్ణ ,తలారి జగన్, అన్నసా రం రాజు, శేఖర్ పెద్దింటి రాములు, బాజరప్ప, జన్మల నరేష్, గౌస్, బుడ్డ శ్రీనివాస్, వెంకట్ సాయి , జన్మల గోపాల్ ,ప్రశాంత్, పట్వారి బాలప్ప, తలారి జనార్ధన్ లు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

స్ఫూర్తిదాయకుడు స్వామి వివేకానంద