దళితుల సమగ్రాభివృద్ధికి సర్కారు కృషి
– దళితబంధును సద్వినియోగం చేసుకోవాలి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో దళితుల సమగ్రాభివృద్ధికి సర్కారు కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం ద్వారా తాండూరు పట్టణానికి చెందిన రవికుమార్ కు గూడ్స్ ఆటో మంజూరైంది. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారునికి ఆటోను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళిత సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ దళితబంధును ప్రవేశ పెట్టారన్నారు. నియోజకవర్గంలో దళితులందరికి దశలవారిగా లబ్ది చేకూరుతుందన్నారు. అర్హులందరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.



