స్ఫూర్తిదాయకుడు స్వామి వివేకానంద
– తాండూరులో ఘనంగా జయంతి ఉత్సవాలు
– వివేకానంద వేషాధారణలో కేవీసీఎస్ విద్యార్థులు
– నివాళులు అర్పించిన నాయకులు, సంఘాల ప్రతినిధులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన స్వామి వివేకానంద స్ఫూర్తిదాయకుడుగా నిలిచారని తాండూరుకు చెందిన పలువురు అభివర్ణించారు. సోమవారం స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

తాండూరు పట్టణం శాంత్ మహాల్ చౌరస్తా సమీపంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డిలు ముఖ్య అతిథులతో పాటు పలువురు ప్రముఖులు, నాయకులు, సంఘాల ప్రతినిధులు హాజరై పూల మాల వేసి నివాళులు అర్పించారు.

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పట్టణంలోని క్రిష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు వివేకానంద వేషాధారణలో ఆకట్టుకున్నారు. విద్యార్థులు ఆయన జీవిత చరిత్రను నాటకరూపంగా ప్రదర్శన చేసి మైమరిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వామి వివేకానంద ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన వివేకానంద దేశానికి, యువతకు స్ఫూర్తి దాయకుడని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బీసీ కమీషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత. వివేక్ సేవా సమితి వ్యవస్థాపకులు బీడే వీరభద్రప్ప, కేవీసీఎస్ ప్రిన్సిపల్ ప్రశాంత్, టీచర్లు, వివిధ సంఘాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

