కాంగ్రెస్ గూటికి కమలం నేత..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ గూటికి కమలం నేత..!
– ఐటీ మంత్రి సమక్షంలో చేరిక
– స్వాగతించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– పట్టణంలోని మరికొందరి వలసలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీకి చెందిన సుదర్శన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

బీజేపీ పార్టీలో స్వార్థ రాజకీయాలు సహించలేక రెండు రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం తాండూరు పర్యటనకు వచ్చిన ఐటీ శాఖ మంత్రి శ్రీదర్ బాబు సమక్షంలో సుదర్శన్ గౌడ్ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సుదర్శన్ గౌడ్‌ను స్వాగతించి.. మంత్రి సమక్షంలో పార్టీలోకి ఆహ్వానించారు.

మరోవైపు తాండూరు ఎమ్మెల్యె మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలోకి వలసలు కొనసాగాయి. తాండూరు మున్సిపల్ 10వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి ఎండీ శికంధర్ మరియు పాపెజ్, ఆఫ్రోజ్ ఖాన్, అక్రమ్‌తో పాటు 17వ వార్డు నుండి ఖలీద్, మెరాజ్, సమీర్, ముజాహిద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బొంలు రామ్మోహన్, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీగౌడ్, బంటు మల్లప్ప, జుబేర్ లాల, మసూదన్, విజయ భాస్కర్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

తాండూరు కమలంకు మరో షాక్..!