తాండూరు కమలంకు మరో షాక్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు కమలంకు మరో షాక్..!
– బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి మిట్టి శ్రీనివాస్ రాజీనామా
– పార్టీ వీడేందుకు గల కారణాల వెల్లడి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ బీజేపీ పార్టీకి మరోషాక్ తగలింది. రెండు రోజుల క్రితం బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యాక్షులు సుదర్శన్ గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి మిట్టి శ్రీనివాస్ కూడా అదే బాటలో నడిచారు.

పార్టీ సభ్యత్వానికి, పట్టణ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీలో 2009 నుంచి వివివ పదవుల్లో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరిగిందని తెలిపారు. గత మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ టిక్కెట్ ఆశిస్తే అప్పట్లో పార్టీ పెద్దలు మరోసారి టిక్కెట్ ఇస్తామని హామి ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకునే వార్డులో రిజర్వేషన్ అనుకూలంగా రాకపోవడంతో గతంలో ఇచ్చిన హామి మేరకు తనకు వేరే వార్డు నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని పార్టీ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వివరించారు.

అయితే పార్టీలో సరిగ్గా గుర్తింపు లేని వారికి కౌన్సిలర్ టిక్కెట్ ఇచ్చి.. తనకు అవకాశం ఇవ్వలేదని ఆవేధన వ్యక్తం చేశారు. పార్టీలో గుర్తింపు లేకపోవడంతో గుండెల నిండా అభిమానం ఉన్న పార్టీని వీడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. అందుకే తప్పని పరిస్ధితిలోతీవ్ర ఆవేధనతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. పార్టీకి రాజీనామా తరువాత రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

ఇదికూడా చదవండి…

సాయిపూర్ అంతా కారుకే జై..!