వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ బదిలీ

తాండూరు రాజకీయం వికారాబాద్

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ బదిలీ
– కొత్త కలెక్టర్‌గా దీపక్ తివారి నియామకం
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త కలెక్టర్‌గా దీపక్ తివారి నియామకం అయ్యారు.

ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా 45 మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కల్పించారు. ఈ క్రమంలో వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను నారయణపేట్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో జిల్లా కలెక్టర్‌గా ఆసిఫబాద్ జిల్లా అనదపు కలెక్టర్‌గా ఉన్న దీపక్‌ తివారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

యాలాల మండల ఎంఈఓగా శేరి మహిపాల్ రెడ్డి