గ్రేట్ డా.సంపత్ సార్..!
– 155వ సారి రక్తదానం
– అత్యవసర పరిస్థితిలో ప్రాణానికి భరోసా
తాండూరు, దర్శిని ప్రతినిధి: సాధారణంగా ఎవరైనా వారి జీవీతంలో 100 సార్ల వరకు రక్తదానం చేయొచ్చని అంటుంటారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన శ్రీ బాలాజీ నర్సింగ్ హోమ్ అధినేత, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, కాంగ్రెస్ నేత డా.సంపత్ కుమార్ 155వ సారి రక్తదానం చేసి గ్రేట్ అనిపించుకోవడంతో పాటు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. డా.సంపత్ కుమార్ చేసిన రక్తదాన సేవకు అందరు ఫిదా అయిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. నాందేడ్ పూర్ కు చెందిన వెంకటయ్య అనే వ్యక్తికి కోలోరెక్టల్ అనే సర్జరీ కోసం రక్తం అత్యవసర పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయం తెలుసుకున్న డా. సంపత్ కుమార్ తనది ఓ నెగిటివ్ బ్లడ్ కావడంతో పట్టణంలోని ఆయుష్ బ్లడ్ బ్యాంకు వారి ద్వారా రక్తదానం చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు డా. సంపత్ కుమార్ చూపిన చొరవతో మానవత్వానికి ఆదర్శంగా నిలిచారని అందరు కొనియాడారు. గతంలో ఎన్నో సార్లు డాక్టర్ సంపత్ కుమార్ రక్తదానం చేశారు. గత యేడాది సెప్టెంబర్‌లో కూడా అర్దరాత్రి ఓ గర్భిణీకి రక్తం అవసరమైతే వెంటనే వెళ్లి రక్తదానం చేశారు.
ఇదికూడా చదవండి…

