పారదర్శకంగా డబుల్ ఇండ్ల పంపిణీ

తాండూరు రాజకీయం వికారాబాద్

పారదర్శకంగా డబుల్ ఇండ్ల పంపిణీ
– బీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచారాలను ఖండిస్తున్నాం
– డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి న్యాయవాది గోపాల్
తాండూరు, దర్శిని ప్రతినిధి : అర్హులైన పేదలకు పారదర్శకంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ చేసేందుకు ప్రక్రియ జరగుతుందని కాంగ్రెస్ పార్టీ డీసీసీ వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి న్యాయవాది కె. గోపాల్ అన్నారు.

తాండూరులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై బీఆర్ఎస్, బీజేపీ నాయకుల అబద్ధాల ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలో సుమారు వెయ్యి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను అర్హులైన పేద కుటుంబాలకు కేటాయించే ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరుగుతుందని తెలిపారు.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో గతంలో అర్హులైన పేదల నుండి దరఖాస్తులు స్వీకరించి, కలెక్టర్ పర్యవేక్షణలో క్షేత్రస్థాయి విచారణ నిర్వహించిన అనంతరం అర్హుల జాబితా తయారు చేయడం జరిగిందని తెలిపారు. ఈ జాబితా ఆధారంగా కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతిన ఇళ్ళు కేటాయించడం జరుగుతున్నది.

ఇందులో ఎటువంటి అవకతవకలకు, అక్రమాలకు తావు లేదని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు 200 ఇళ్ళు ఒకే వర్గానికి కేటాయించారు అని చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని అన్నారు. ప్రభుత్వ పేద అనుకూల పథకాలపై ఓర్వలేని మనస్తత్వంతో ఇలాంటి పచ్చి అబద్ధాలు వ్యాప్తి చేయడం మానుకోవాలని సూచించారు.

డబుల్‌ ఇండ్ల పంపిణీలో అసత్య ప్రచారాలు