మిస్టరీగా.. మహిళ మిస్సింగ్..!
– కూలీ పనులకు వెళ్లి అదృశ్యం
– వారం అయినా తెలియని జాడ
– బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : దినసరి కూలీగా పనిచేసే మిస్టరీగా మిస్సింగ్ అయ్యింది. వారం క్రితం కూలీ పనులకు వెళ్లిన ఆమె తిరిగిరాలేదు.

ఈ సంఘటన బషీరాబాద్ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంభీకులు, బషీరాబాద్ ఎస్ఐ విఠల్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బషీరాబాద్ మండలంలోని జీవన్గి గ్రామానికి చెందిన ఏనుముల మహేశ్వరి(32) దినసరి వలస కూలీగా పనిచేస్తోంది. కూలీ పనుల్లో భాగంగా వికారాబాద్ వెళ్ళేది.

వారం రోజుల క్రితం కూడా ఉదయం 5 గంటల సమయంలో మహేశ్వరి కూలీ పనికోసమని వికారాబాద్ వెళ్లింది. ఆరోజు నుంచి ఇంటికి తిరిగి రాలేదు. మహేశ్వరి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వికారాబాద్, శంకర్‌పల్లితోపాటు పలు ప్రాంతాలలో వెతికిన ఫలితం లేకపోయింది.

చివరకు మహేశ్వరి అన్న ఏనుముల ఈరప్ప ఈనెల 13వ తేదీన బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. మహేశ్వరి ఆచూకీ తెలిసిన వారు సెల్: 9014104571కు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.


