వీరశైవ సమాజంకు తోడ్పాటు

తాండూరు రాజకీయం వికారాబాద్

వీరశైవ సమాజంకు తోడ్పాటు
– చీఫ్‌ విప్ మహేందర్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
– పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– ఘనంగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని వీరశైవ సమాజం అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ విప్ మహేందర్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు అన్నారు.

ఆదివారం తాండూరు పట్టణం వీరశైవ కళ్యాణ మండపంలో వీరశైవ సమాజం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్‌ విప్ మహేందర్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చీఫ్ విప్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో తాను వీరశైవ సమాజం అభివృద్ధికి సహాకారం అందించడం జరిగిందన్నారు. ముందు కూడా పూర్తి సహాకారం అందిస్తామని అన్నారు.

ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు మాట్లాడుతూ బసవేశ్వరుని స్ఫూర్తితో సమ సమాజ స్థాపన కోసం కృషి చేస్తున్న వీర శైవ సమాజం అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని అన్నారు. అదేవిధంగా నూతన అధ్యక్షుడిగా తంబాకు చంద్రశేఖర్, కార్యదర్శిగా బసవరాజ్, తదితరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, టీపీసీసీ ప్రచార సమన్వయ కర్త కరణం పురుషోత్తం రావు, బీఆర్ఎస్ తాండూరు ఇంచార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి, వీరశైవ సమాజం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

పేద ప్రజల ఆరోగ్యమే ధ్యేయం