ఎంసీహెచ్‌లో ప్రోటోకాల్ రగడ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎంసీహెచ్‌లో ప్రోటోకాల్ రగడ..!
– జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ పై ఆగ్రహం
– అధికార కార్యక్రమంలో మర్యాద పాటించలేదని మండిపాటు
– మనస్థాపంకు గురైన సూపరిండెంట్..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని మతా శిశు ఆసుపత్రి(ఎంసీహెచ్) లో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకున్నట్లు తెలిసింది. అధికార కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని తెలంగాణ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి ఆసుపత్రి సూపరిండెంట్ డా.రవిశంకర్ పై మండిపడ్డారని సమాచారం. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఎంసీహెచ్ ఆసుపత్రిలో ఇందిరా మహిళ శక్తి కార్యక్రమంలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో క్యాంటీన్ ప్రారంభోత్సం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

అనంతరం కార్యక్రమం ఆహ్వానంకు ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదని చీఫ్ విప్ మహేందర్ రెడ్డి ఆసుపత్రి సూపరిండెంట్ డా.రవిశంకర్ పై మండిపడ్డట్లు తెలిసింది. అదేవిధంగా మెప్మా అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ఈ విషయం డీసీహెచ్ఎస్ దృష్టికి వెళ్లడంతో చర్చనీయాంశంగా మారింది. చీఫ్ విప్ మండిపడడం పట్ల ఆసుపత్రి సూపరిండెంట్ డా. రవిశంకర్ మనస్థాపంకు గురైనట్లు తెలిసింది. ఆసుపత్రి నుంచి వెళ్లిపోతు పదవికి రాజీనామా చేస్తాయనని చెప్పినట్లు ప్రచారం జరిగింది. మరోవైపు ఈ సంఘటనపై పలువురు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

అప్పులున్నా.. సంక్షేమాన్ని ఆపలేం..!