బీసీ దండోరాకు తరలిరావాలి
– ఆర్.కృష్ణయ్యను కలిసిన తాండూరు నాయకులు
తాండూరు, దర్శినిప్రతినిధి : వచ్చేనెలలో దేశ రాజధాని ఢిల్లిలో చేపట్టే బీసీ దండోరాకు తరలి రావాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య తాండూరు బీసీ సంఘం నేతలకు సూచించారు.

గురువారం హైదరాబాద్‌లోని బీసీ భవన్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య తాండూరు బీసీ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గంలో బీసీల రాజకీయ, సామాజిక సాధికారత కోసం కొనసాగుతున్న ఉద్యమాలు, చేపడుతున్న కార్యక్రమాలు, స్థానిక సమస్యలపై జరుగుతున్న పోరాటాలను నాయకులు ఆయనకు వివరించారు.

ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ వచ్చే నెలలో ఢిల్లీలో బీసీల హక్కులు, రాజకీయ సాధికారత, రిజర్వేషన్ల పరిరక్షణ, రాజ్యాంగబద్ధ హక్కుల సాధన కోసం భారీ స్థాయిలో బీసీ దండోరా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువత, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం తాండూరు నాయకులు మాట్లాడుతూ తాండూరు బీసీ నాయకులు రాజకుమార్ కందుకూరి నేతృత్వంలో బీసీ దండోరాను విజయవంతం చేస్తామని తెలిపారు. ఆర్.కృష్ణయ్యను కలిసిన వారిలో బీసీ సంఘం నాయకులు సయ్యద్ షుకూర్, అనిత, బసవరాజు, పరమేష్ తదితరులు ఉన్నారు.


