తప్పుల లేకుండా ఓటరు సవరణ జరగాలి
– తాండూరు ఆర్డీఓ అనిత
– పట్టణంలో సర్ కార్యక్రమం పరిశీలన
తాండూరు, దర్శినిప్రతినిధి : తప్పులు లేకుండా ఓటరు సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని తాండూరు ఆర్డీఓ అనిత అన్నారు.

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక ఓటరు సవరణ(సర్) కార్యక్రమంపై గురువారం ఆర్డీఓ అనిత దృష్టిసారించారు. మున్సిపల్ పరిధిలో పలు వార్డుల్లో జరుగుతున్న కార్యక్రమాన్ని పరిశీలించారు.

ఆయా వార్డుల్లో ఓటరు నమోదును చేస్తున్న బీఎల్‌ఓలతో అడిగి తెలుసుకున్నారు. సర్‌లో ఓటర్ల నమోదును పారదర్శంగా చేపట్టాలని సూచించారు. అర్హులైన ఓటర్ల వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని అన్నారు.

బీఎల్‌ఓలు, పార్టీల బీఎల్‌ఏలతో సమన్వయం పాటించి సర్‌ను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్ తారాసింగ్, డిప్యూటీ తహసీల్దార్ లలిత, సిబ్బంది తదితరులు ఉన్నారు.

